చలికాలంలో ఆరోగ్య సమస్యలా.. నీటిలో ఒక్క చెంచా దీన్ని కలిపి వాడితే సెట్! | Salt Water Benefits| Salt Water Gargle Benefits| health benefits of warm salt water

posted on Dec 1, 2023 2:49PM

చలికాలంలో ముక్కు, చెవి,  గొంతుకు సంబంధించిన సమస్యలు చాలా వస్తాయి. వాటిలో జలుబు, గొంతు కింద వాపు ముఖ్యమైనవి. ఇవి టాన్సిల్స్ సమస్యకు దారితీస్తాయి. టాన్సిల్స్ కారణంగా ఆహారం తిన్నాలన్నా, తాగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి చాలా సింపుల్ గా చెక్ పెట్టవచ్చు. కేవలం ఒక్క చెంచా వంటింట్లో ఉండే పదార్థాన్ని నీళ్లలో  కలిపి ఉపయోగించడం వల్ల టాన్సిల్ సమస్య తగ్గుముఖం పడుతుంది. అసలు జలుబు, టాన్సిల్స్ సమస్య ఎందుకొస్తుంది? దీనికి కారణాలు ఏంటి? తెలుసుకుంటే..

చలికాలంలో చల్లని, పొడిగాలులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలల్లో ఈ గాలులు ఎక్కువ. ఇలాంటి వాతావరణంలో ఉండటం వల్ల గాలుల ప్రభావం గొంతులో కణజాలాన్ని పొడిగా మారుస్తుంది. దీనికారణంగా గొంతులో చికాకును, వాపును కలిగిస్తుంది. ఇదే క్రమంగా గొంతు నొప్పి, జలుబు, సైనస్, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.  ఈ సమస్య ఏర్పడిన తరువాత తొందరగా సమస్యను గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే టాన్సిల్స్ కు దారితీస్తుంది.

జలుబు వస్తే..

చలికాలంలోనే కాదు జలుబు చేస్తే ముక్కులు బ్లాక్ అయిపోతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనికారణంగా రోజంతా డిస్టర్బ్ అవుతారు. జలుబును లైట్ తీసుకుంటే శ్లేష్మం పెరుగుతుంది. గొంతులో వాపు కూడా వస్తుంది. దీన్నుండి ఉపశమనం పొందాలంటే గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. దీనివల్ల శ్లేష్మం తొలగిపోతుంది. ముక్కులు కాస్త రిలాక్స్ అవుతాయి.

టాన్సిల్స్ వస్తే..

టాన్సిల్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆహారం తినాలన్నా, తాగాలన్నా కూడా ఇబ్బందే. దీన్ని పరిష్కరించాలంటే ఇంట్లో ఉన్న ఒక్క స్పూన్ ఉప్పు చాలు. లీటరు నీటిలో ఒక స్పూను ఉప్పు వేసి బాగా పుక్కిలించాలి. రోజులో ఇలా నాలుగైదు సార్లు చేస్తుంటే చాలు గొంతు నొప్పి, గొంతులో శ్లేష్మం తగ్గుతుంది. బ్లాక్ అయిపోయిన ముక్కులు రిలాక్స్ అవుతాయి. జలుబు, టాన్సిల్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లను కూడా ఇది తొలగిస్తుంది. దగ్గు సమస్య ఉంటే అది కూడా తగ్గిపోతుంది.

ఉప్పు నీరుతో పుక్కిలిస్తేనే ఉపశమనం ఎందుకుంటుందంటే..

నీటిలో ఉప్పు కలిపినప్పుడు నీటి పిహెచ్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. దీని కారణంగా బ్యాక్టీరియా అభివృద్ది చెందదు. ఎందుకంటే ఆల్కలీన్ వాతావరణంలో బ్యాక్టీరియా ఎక్కువకాలం మనుగడ సాగించలేదు.

                                                *నిశ్శబ్ద.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top