posted on Nov 27, 2023 9:41AM
మానవ జీవితానికి సంబంధించి చాణక్యుడు, మనకు అనేక విషయాలను బోధించాడు ఇవన్నీ కూడా కౌటిల్యుని శాస్త్రంలో పొందుపరిచారు. మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు చాణక్యనీతి మార్గం చూపిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త, అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన విధానాలు ప్రజల మనోధైర్యాన్ని పెంచేలా పనిచేస్తాయి. చంద్రగుప్త మౌర్యుని గురువుగా ఉన్న చాణక్యుడు కూడా ప్రేమ గురించి చాలా విషయాలు చెప్పారు. అందుకు సంబంధించిన నాలుగు విషయాలు తెలుసుకుందాం.
భాగస్వామి పట్ల గౌరవం:
తన ప్రేయసిని లేదా భార్యను గౌరవంగా చూసే వ్యక్తి తన సంబంధాన్ని ఎప్పటికీ విడగొట్టుకోలేడని చాణక్యుడు తన విధానంలో చెప్పాడు. అలాంటి వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది.
ప్రేమలో నిజాయితీ:
తన ప్రేమను పూర్తి నిజాయితీతో నెరవేర్చుకునే వ్యక్తి అంటే మరొక స్త్రీ వైపు చూడని వ్యక్తి, అతని సంబంధం ఎప్పుడూ విచ్ఛిన్నం కాదు. దీనికి విరుద్ధంగా, ఒక వ్యక్తి తన భాగస్వామి కాకుండా మరే ఇతర స్త్రీ గురించి తన మనస్సులో తప్పుగా భావించినా అతని ప్రేమ విజయవంతం కాదు.
ఆనందం:
చాణక్య నీతి ప్రకారం, తన జీవిత భాగస్వామికి మానసిక ఆనందాన్ని అందించే వ్యక్తియే శారీరక సంతృప్తిని కూడా అందిస్తాడు. అలాంటి వారికి వైవాహిక జీవితంలో ఎప్పుడూ అడ్డంకులు లేవు.
భాగస్వామికి భద్రత:
తన భార్యను సురక్షితంగా ఉంచే వ్యక్తితో అతడి ప్రేమ జీవితం కూడా చక్కగా సాగుతుంది. ఒక స్త్రీ తన భర్తలో తన తండ్రి రూపాన్ని చూసుకుంటుంది. అలాగే స్త్రీ తన భాగస్వామి ఒక తండ్రి లాగా రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది. అంతే కాదు తాను ఎక్కడికి వెళ్లినా తనకు ఎలాంటి పరిస్థితి వచ్చిన తన భర్త తోడు ఉండాలని ఆమె ఆశిస్తుంది.