posted on Nov 25, 2023 11:27AM
ఆరోగ్యంగా ఉండాలన్నా..ఫిట్ గా ఉండాలన్నా..కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు. వ్యాయామంతోపాటు కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి.
– వ్యాయామాలు చేసేవారు ఏదొక తేలికపాటి భోజనంతో సరిపెట్టుకోకూడదు. ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు ఉండేలా చూడాలి. అది కూడా ఒకేరకం పదార్థాల నుంచి కాకుండా ఇతర రకాల ఆహారాల నుంచి అందేలా చూసుకోవాలి. దీనికోసం అప్పటికప్పుడు ఆలోచించకుండా వారానికి సరిపడా డైట్ ప్లాన్ చేసుకుంటే మంచిది .
– వ్యాయామం అయినా, ఆహారమైనా ఎంత అవసరమో అంతే తీసుకోవడం తప్పనిసరి. ఎలాగు కసరత్తులు చేస్తున్నామంటూ అతిగా తినడం సరికాదు. సన్నబడాలన్న తపనతో అసలు తినకుండా ఉండట కూడా మంచిది కాదు. వర్కవుట్స్ చేయడానికి ముందు తినే స్నాక్స్ లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పడే తగినంత ఉత్సాహంతో వ్యాయాయం చేస్తాం.
– కార్డియో ట్రైనింగ్ కు వెళ్లేవారు పొట్టను ఎంత వీలైతే అంత ఖాళీగా ఉంచుకోవడం మంచిది. ఒక కప్పు గ్రీన్ టీ తోపాటుగా ఏదైనా పండు తీసుకుంటే సరిపోతుంది. వర్కవుట్స్ తర్వాత త్రుణధాన్యాలతో చేసిన ఉప్మా, దోసె, కొవ్వు తక్కువగా ఉండే పాలు పండ్ల రసాలు, పెరుగు వంటివి తింటే కండరాలకు సాంత్వన లభిస్తుంది.
-భోజనం తర్వాత వ్యాయామం చేయాలనుకుంటే కచ్చితంగా మూడు నుంచి నాలుగు గంటల విరామం తర్వాత జిమ్ కు వెళ్లాలి.