posted on Nov 22, 2023 9:30AM
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. సమతుల్య ఆహారంలో పౌష్టికర ఆహారంలో అరటిపండుకు తప్పనిసరిగా చోటు ఉంటుంది. ఇది అందరికీ అందుబాటు ధరలోనే అన్ని సీజన్లలో లభిస్తుంది. అయితే అరటిపండ్లలో రకాలున్నాయి. వీటిలో ఎర్ర అరటి పండు ఒకటి. తొక్క ఎర్రగా, పరిమాణంలో సాధారణ అరటిపండ్లకంటే పెద్దగా ఉండే ఈ అరటిపండ్లు సాధారణ అరటి పండ్లకంటే తియ్యగా ఉంటాయి. వీటిలో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ ఎర్ర అరటిపండ్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా 21రోజుల పాటు తింటే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి.
ఎర్ర అరటిపండ్లు 21రోజుల పాటు తింటే వేధిచే చర్మ సమస్యలు తగ్గుతాయి. పొడి చర్మం, దద్దుర్లు, చర్మం ఎర్రగా మారిపోవడం, సోరియాసిస్, వంటి చర్మసమస్యలకు ఎర్ర అరటిపండు అద్భుత ఔషదం. వీటిని తినడమే కాదు, చర్మ సమస్యలున్న చోట పూతగా కూడా అప్లై చేయవచ్చు. దీని వల్ల సొరియాసిస్ లాంటి దారుణమైన చర్మ సమస్యలే తగ్గుతాయి.
ప్రస్తుతకాలంలో సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడుతన్న జంటలు చాలా ఉన్నాయి. పిల్లల కోసం వైద్యుల చుట్టూ, గుడుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ఎర్ర అరటిపండు క్రమం తప్పకుండా తీసుకుంటే పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా, ధృడంగా మారుతుంది. సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. మగవారిలో అంగస్థంభన సమస్య దూరం అవుతుంది.
ఎర్ర అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నాడీ వ్యవస్థను బలంగా చేసి ట్యాక్సిన్లను డిటాక్సిపై చేస్తాయి. నరాల సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు, పక్షవాతం, మూర్చలు వంటి సమస్యలున్నవారు రెగ్యులర్ గా ఎర్ర అరటి పండ్లు తింటూ ఉంటే నాడీ బలం పుంజుకుంటుంది. .
ఎర్ర అరటిపండ్లలో సాధారణ అరటిపండ్లకంటే ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తింటూ ఉంటే మూత్రపిండాలలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు.
ఎర్ర అరటిపండ్లలో విటమిన్స్, పొటాషియం, కాల్షియం సమృద్దిగా ఉంటాయి. వీటిని రోజూ తింటే పంటికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. 21రోజులు ఎర్ర అరటిపండ్లు తింటే నోటి దుర్వాసన, చిగుళ్ల బలహీనతతో పాటు అన్ని రకాల పంటి సమస్యలు దూరమవుతాయి.
*నిశ్శబ్ద.