AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు త్వరతో శుభవార్త అందే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం నేడు (మార్చి 10) అసెంబ్లీ సమావేశంలో లిఖిత పూర్వకంగా సమర్పించింది. అన్ని జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాకు సంబంధించి 66,309 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.
- అమెజాన్‌లో ఎయిర్ కండీషనర్ల ప్రారంభ ధర రూ. 24,999/- మాత్రమే!
మొత్తం 7,71,177 ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా.. వీరిలో శాశ్వత ఉద్యోగులు 5,29, 868 మంది. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 1,75,000 మందిదాకా ఉన్నారు. మొత్తం శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు 7,04,868 మంది ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా1,27,000 ఉద్యోగాలు భర్తీ చేయగా.. వైద్యారోగ్య శాఖలో 22,306 ఉద్యోగాలు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా నియామకాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ ఖాళీల వివరాలను ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసింది.
ఇక.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 83,039 ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై కూడా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న విషయం కూడా విధితమే. ఈ క్రమంలో త్వరలో ఏపీ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పే అవకాశాలున్నాయి.