posted on Nov 29, 2023 2:51PM
కొలెస్ట్రాల్ అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికి సరైన ఆహారం, దిగజారుతున్న జీవనశైలి, ఒత్తిడి. కారణం అవుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ విషయంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా బాధ్యత వహిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్‌లను తినకూడదని కొందరు హెచ్చరిస్తుంటారు. ఈ వాదనలో నిజమెంతో తెలుసుకుందాం.
జీడిపప్పులో ఉండే పోషకాల గురించి మాట్లాడితే, ఆరోగ్యానికి అవసరమైన 44 శాతం కొవ్వు, 30 శాతం కార్బోహైడ్రేట్స్, 18 శాతం ప్రోటీన్లను కలిగి ఉంటుంది. జీడిపప్పు పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. పోషకాలు అధికంగా ఉండే జీడిపప్పు వినియోగం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం.
జీడిపప్పు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
జీడిపప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బ్రెడ్ గులాబ్ జామూన్ తయారీ విధానం..
గులాబ్ జామున్ అనేది మన సాంప్రదాయ స్వీట్, భారతదేశంలో చాలా మంది అత్యంత ఇష్టపడే స్వీట్‌లలో గులాబ్ జామూన్ ఒకటి. ఈ ఇంట్లో తయారుచేసుకునే ఈ గులాబ్ జామూన్ ను మనం ఇప్పుడు బ్రెడ్, క్రీమ్, పాల పౌడర్‌తో తయారు చేయవచ్చు. ఇది రుచికరం మాత్రమే కాదు, తయారు చేయడం కూడా చాలా సులభం.