If These Symptoms Appear In The Legs, It Means Diabetes

[ad_1]

డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక జీవక్రియ రుగ్మత ఇది. ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతుంది. శరీరంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడంలో లేదా సమర్థవంతంగా ఆ ఇన్సులిన్ ఉపయోగించడంలో శరీరం విఫలమవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఇలా పెరిగేటప్పుడు కాళ్లతో సహా ఇతర అవయవాలను ప్రభావితం చేస్తాయి. వైద్యులు చెబుతున్న ప్రకారం సకాలంలో డయాబెటిస్ రోగ నిర్ధారణ చేసి, సరైన మందులను వాడడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయలేం, కానీ అదుపులో ఉంచగలం. అయితే మధుమేహం వచ్చినప్పుడు కాళ్లలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. మధుమేహం తీవ్రంగా ఉన్న సమయంలో ఇవి కనిపించే అవకాశం ఉంది.

డయాబెటిస్ వల్ల నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ. దీనివల్ల కాళ్లలో నరాల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కాళ్ళు తిమ్మిరి పట్టడం, మంటలు పుట్టడం, జలదరింపులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వారి పాదాలపై గాయాలు లేదా పుండ్లు వచ్చినా కూడా త్వరగా తగ్గవు. అంటు వ్యాధులు కూడా త్వరగా సోకుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగిపోవడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. కాలు తిమ్మిర్లు పట్టడం, నొప్పి పుట్టడం, బలహీనంగా మారడం వంటివి జరుగుతాయి. అంతే కాదు ఈ కాలు తిమ్మిర్లు, నొప్పి వంటివి త్వరగా తగ్గవు. చాలా నెమ్మదిగా తగ్గుతాయి. చికిత్స చేయకుండా అలా వదిలేస్తే గ్యాంగ్రీన్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. దీని వల్ల కాలు లేదా పాదాన్ని తొలగించాల్సి రావచ్చు.

 కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన మందులను వాడడం చాలా ముఖ్యం. రక్తప్రసరణ కాళ్ళకి, పాదాలకి సరిగా జరగకపోవడం వల్ల పుండ్లు పడే అవకాశం ఉంది. ఇది ఇన్ఫెక్షన్ గా మారి తీవ్రంగా ఇబ్బంది పడతాయి. ఎముకలు బలహీనంగా మారడం, కీళ్లు దెబ్బ తినడం, పాదాలలో పగుళ్లు ఏర్పడడం వంటివి జరుగుతాయి. మధుమేహం వల్ల చర్మం పొడిబారి పోతుంది. దీనివల్ల పాదాల పగుళ్లు ఏర్పడతాయి. ఆ పగుళ్లలో ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు చేరి పాదాలను తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. డయాబెటిస్ వచ్చినవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోకపోతే పాదాలను తొలగించే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి.

మధుమేహం ఉన్న వ్యక్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలి. మంచి లైఫ్ స్టైల్ అధికంగా ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ గంట పాటు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. వైద్యులు సూచించిన విధంగా మందులు వాడాలి. అవసరమైతే ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే పాదాలు, కాళ్లు తీవ్రంగా దెబ్బ తినే అవకాశం ఎక్కువ. ఎంతో మంది డయాబెటిస్ కారణంగా పాదాలను, కాళ్ళను తొలగించుకోవాల్సిన అవసరం పడింది.

Also read: మీ వివాహం ఆనందంగా సాగాలంటే ప్రతి రోజూ ఉదయం ఈ పనులు చేయండి

Also read: ఆ గర్భం నా వల్ల వచ్చింది కాదనిపిస్తోంది, ఇప్పుడు ఏం చేయాలి?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top