అమెరికాలో ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో దోపిడీ జరిగింది. అయితే.. ఆ చోరీ జరిగిన తీరుతో దుకాణంలోని సిబ్బంది అవాక్కయ్యారు.
లాస్ ఏంజెల్స్: ముసుగులు ధరించి 50 మంది దొంగలు ఒక దుకాణంలోకి హఠాత్తుగా దూసుకొచ్చారు. ఏదో పోటీ పెట్టినట్టుగా అందినకాడికి అక్కడి వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఆ ఘటన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. లాజ్‌ఏంజెల్స్ పోలీసు విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం..
టొపంగా మాల్‌లోని నార్డ్‌స్ట్రామ్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోకి దాదాపు 50 మంది వ్యక్తులు దూసుకొచ్చారు. ఎవరూ గుర్తించకుండా ముసుగులు ధరించారు. భద్రతా సిబ్బందిపై పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు. తర్వాత చేతికందిన ఖరీదైన బ్యాగులు, దుస్తులు దోచుకున్నారు. ఆ ఫ్లాష్ మాబ్ అంతే వేగంగా అక్కడి నుంచి జారుకుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ దొంగతనం జరిగింది. దోపిడీదారులు హింసాత్మకంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు జరుగుతోందని తెలిపారు. వారు దోచుకున్న వస్తువుల విలువ లక్ష డాలర్ల వరకు ఉంటుందని వెల్లడించారు.
ఇన్‌స్టాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని భార్య హత్య
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ ఆకస్మిక చర్యతో అక్కడున్న సిబ్బంది వారిని అడ్డుకోలేక.. నిస్సహాయులుగా మారిపోయారు. ఆ దుండగులు బీఎంబ్ల్యూ, లెక్సస్ వంటి పలు ఖరీదైన వాహనాల్లో దోపిడీకి వచ్చారని పోలీసులు తెలిపారు.